శివ పరమాత్మకు ప్రతిరూపంగా నాడు అందరిచే గౌరభిమానాలు పొందిన జంగమలకు నేడు ఆదరణ కరువయ్యింది. రాజకీయంగా, ప్రభుత్వపరంగా , సామాజికంగా జంగమలకు ఎలాంటి గుర్తింపు , సహాయం అందటం లేదు. జంగమలకు ప్రత్యేక కులవృత్తి లేకపోవడంతో ప్రభుత్వ పధకాలు అందటం లేదు. తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఒక ప్రత్యేక వేదిక లేక దిక్కుతోచని దమనీయ స్థితిలో జంగమలు ఉన్నారు.జంగమ కులం అనేది ఒకటి ఉందా ? అని అధికారులలో, రాజకీయ పార్టీలలో సందేహం ఏర్పడినప్పుడు మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అని జంగమ సంక్షేమ సంఘం ముందుకు వచ్చింది. చిత్తూరులో ప్రారంభం అయిన సంఘం రాష్ట్రంలో కూడా విస్తరించింది. మండల, జిల్లాలలో కార్యవర్గాలు ఏర్పాటై పని చేస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా జంగమ సంక్షేమ సంఘం రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా బలపడింది.
ఆశయాలు:
* హిందూ సంస్కృతిలో ఉన్నతమైన శివ భక్తిని జంగమల్లో పెంచడం
.* తెగలకు అతీతంగా జంగమలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి సంఘటితం చేయడం
* రాజకీయాలకు అతీతంగా జంగమ ఉద్యమాన్ని నిర్మించడం.
* మండల, పంచాయతిలలో జంగమ కమిటీలను ఏర్పాటు చేయడం .
* వివాహ వేదికను ఏర్పాటు చేయడం.
* పేద విద్యార్థులను ఆదుకోవడం. ప్రోత్సాహక బహుమతులు అందచేయడం
* జంగమల హక్కుల సాధనకు మండల, జిల్లాలలో ఉద్యమించడం .
* జంగామలకు ఇళ్ళ పట్టాలు, రేషన్ కార్డులను ఇప్పించడం .
* జంగమలు ఎన్నికలలో పాల్గొనేవిధంగా ప్రోత్సాహించడం.
* జంగమలు రాజకీయంగా, ఉద్యోగపరంగా , సామాజికంగా , ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చైతన్య పరచడం.
* జంగమలలో నిరక్షరాస్యత , బాలకార్మికులను నిర్ములించుట.
* జంగమ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం.
* B C వ్యతిరేక విధానాలను ఎండగట్టడం.
* జంగమలు కాని వారు జంగమ సర్టిఫికెట్లు పొందకుండా జాగ్రర్తలు తీసుకోవడం .
* B C సంక్షేమ సంఘంతో కలిసి ఉద్యమంలో పాల్గొనడం .
* జంగమలలో ఆసక్తి ఉన్న వారికీ పౌరోహిత్యంలో శిక్షణ ఇచ్చి శివాలయాల్లో పూజారులగా నియమించడం.
డిమాండ్లు :
* జంగమలను అత్యంత వెనుకబడిన జాబితా( MBC )లో చేర్చాలి.
* జంగమలు సంచార జీవులు. కావున సంచార జాతులుగా గుర్తించి ST జాబితాలో చేర్చాలి.
* జంగమల అభివృధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి.
* జన్మతహః శివ భక్తులైన జంగమలను శివాలయాల పాలక మండళ్లలో స్దానం కల్పించాలి.
* శివాలయాల పూజారులుగా జంగమలనే నియమించాలి.
* శివాలయాలు , శైవ ఆలయాల భూములను సర్వే చేసి, ఆక్రమణదారుల నుంచి ఆలయాలకు ఇవ్వాలి.
* శైవ ఆలయాల అభివృద్ధికి TTD ఆర్థిక సహాయం చేయాలి.
* పాడైన శైవ ఆలయాలను పునరుద్దరించడానికి ప్రత్యేక నిధులను కేటాయించాలి.
* BC కార్పోరేషన్, BC సంక్షేమ శాఖ పధకాలు అమలు, సమీక్ష కమిటీలలో, జంగమలకు స్దానం కల్పించాలి.
* భూమిలేని జంగమలకు వ్యవసాయ భూములను అందచేయాలి.
* మండల్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి.
* పార్లమెంట్, అసెంబ్లీలలో BCలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి.
* జస్టిస్ పుట్టుస్వామి కమిటీ సిఫార్సులను బహిర్గతం చేసి, అమలు చేయాలి.
* జంగమలకు కుల ధృవీకరణ సర్టిఫికెట్లు జరిచేయునపుడు his / her profession is begging కు బదులు his / her tradition was begging అని మార్పు చేయాలి. లేక అ వాక్యాన్ని తొలగించాలి.
* జిల్లా కేంద్రంలో జంగమ సంక్షేమ భవనం ( కమ్యూనిటి హాల్ ) నిర్మాణానికి స్ధలాన్ని , నిధులను కేటాయించాలి.
జంగమ సంక్షేమ సంఘం పటిష్టతకు జంగమలు అంతా సంఘంలో చేరుదాం. జంగమ ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం. మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. రాజకీయంగా, ఉద్యోగపరంగా , సామాజికంగా , ఆర్థికంగా ఎదుగుదాం.